నిత్యామీనన్ నటిగా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకుంది. అద్భుతమైన హావభావాలు పలికిస్తూ ప్రేక్షకులని మెప్పించగల కొద్దిమంది ఈ తరం నటీమణుల్లో నిత్యామీనన్ ఒకరు. గ్లామర్ ఆరబోతకంటే నిత్యామీనన్ తన పాత్రకే ప్రాధాన్యత ఇస్తుంది. 

కానీ ఇటీవల నిత్యామీనన్ వరుసగా అద్భుతమైన ఆఫర్స్ వదులుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సావిత్రి బయోపిక్ మహానటిలో నటించే ఛాన్స్ మొదట తనకే వచ్చింది అని స్వయంగా పలు సందర్భాల్లో నిత్య మీనన్ తెలిపింది. కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాన్ని నిత్య మీనన్ వదులుకుంది.

ఆ 5 కోట్లు ఏమయ్యాయి, చిరంజీవి కూడా వెళ్ళాడుగా.. బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు 

తాజాగా మరో క్రేజీ ఆఫర్ ని నిత్యామీనన్ రిజెక్ట్ చేసినట్లు టాక్. ఇండియా తరుపున తొలి ఒలంపిక్ మెడల్ సాధించిన మహిళగా రికార్డ్ సృష్టించిన కరణం మల్లీశ్వరి బయోపిక్ కు రంగం సిద్ధం అయింది. ప్రముఖ రచయిత కోనవెంకట్ నిర్మాతగా కరణం మల్లీశ్వరి బయోపిక్ ని పాన్ ఇండియా ప్రాజెక్టు గా ప్రకటించారు. 

నిన్న కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన వచ్చింది. ఈ చిత్రంలో కరణం మల్లీశ్వరి పాత్రలో నిత్యామీనన్ ని సంప్రదించారట.కానీ ఆమె కొన్ని కారణాల వల్ల ఈ ఆఫర్ ని రిజెక్ట్  చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఒప్పుకుని ఉంటె నిన్ననే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయి ఉండేది.