సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా..టైటిల్ కత్తిలాగ లేకపోతే ఖర్చైపోతారనేది సిని సిద్దాంతం. అందుకే వీలైనంత టైమ్ తీసుకుని మరీ టైటిల్ ని ఫిక్స్ చేస్తూంటారు దర్శక,నిర్మాతలు. అయితే ఆ టైటిల్ ఈ కాలానికి తగినట్లుగా, ట్రెండీగా ఉండాలని హీరోలు కోరుకుంటారు. అందరికీ నచ్చే టైటిల్ ని చివరకు ఫైనలైజ్ చేసి ఫస్ట్ లుక్ వదులుతూంటారు. అయితే కొన్ని ఎంతటకీ తెగవు. ఇప్పుడు యేలేటి, నితిన్ చిత్రానికి టైటిల్ సమస్యగా మారిందిట.

నితిన్ – చంద్ర‌శేఖ‌ర్ యేలేటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. భ‌వ్య ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం  ప్ర‌స్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. మరో ప్రక్క ఈ సినిమాకి సరైన  టైటిల్ పెట్ట‌డం కోసం చిత్ర‌ం టీమ్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతోంది. రీసెంట్ గా ‘చ‌ద‌రంగం’ అనే టైటిల్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఈ టైటిల్ మ‌రీ ఓల్డ్ గా ఉందని నితిన్ అంటున్నాడని మీడియా భావిస్తూ కథనాలు ప్రచురించేసింది. అంతేకాక..దర్శకుడుని ఈ సినిమాకు ఈ కాలానికి తగినట్లుగా ట్రెండీగా ఉండే టైటిల్ పెట్ట‌మ‌ని ద‌ర్శ‌కుడ్ని సూచించాడ‌ట‌.

దాంతో మరొకట టైటిల్ ని నితిన్ ముందు పెట్టారట. ఆ టైటిల్  ‘ఏ 1’ అని తెలుస్తోంది.  అయితే ‘ఏ 1’ నెంబర్ వన్ వంటి టైటిల్స్ కూడా ఇప్పుడెవరూ పెట్టడం లేదు అని నితిన్ అన్నారట.  సినిమా అంతా మైండ్ గేమ్ నేప‌థ్యంలో న‌డుస్తుంది కాబట్టి ఆ అర్దం వచ్చేలాగ టైటిల్ పెట్టాలని దర్శకుడు ఆలోచన అని చెప్తున్నారు. యేలేటికి మాత్రం ఈ చిత్రానికి ‘చ‌ద‌రంగం’టైటిల్ అయితే ఫెరఫెక్ట్ అని భావిస్తున్నారట.  

ఇక ఈ సినిమా యేలేటి స్టయిల్లో సాగే థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. తన శైలికి భిన్నంగా 'మనమంతా' అనే ఫ్యామిలీ టచ్ ఉన్న ఎమోషనల్ మూవీ చేసిన యేలేటి ఈసారి ఒకప్పటి తన శైలిలోనే థ్రిల్లర్ తీసి హిట్ కొట్టాలని భావిస్తున్నారట. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో పాటుగా నితిన్ 'చల్ మోహన్ రంగ' తర్వాత కృష్ణచైతన్యతో జత కట్టనున్నాడు. వీరి కలయిలో 'పవర్ పేట' అనే సినిమా తెరకెక్కనుంది.