నితిన్ ప్రస్తుతం ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరక్కుతున్న భీష్మ చిత్రంలో క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

రష్మిక మోహంలో పడిపోయి ఆమె వెంట పడుతున్న నితిన్ లుక్ ఆకట్టుకుంది. భీష్మ చిత్రికరణ చివరి దశకు చేరుకోవడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల వేగం పెంచుతోంది. త్వరలో ప్రేక్షకులకు ఓ సర్ ప్రైజ్ తో చిత్ర యూనిట్ రెడీ అయిపోయింది. 

నితిన్, రష్మిక మధ్య కెమిస్ట్రీ చూపించేలా నవంబర్ 7న ఉదయం 10 గంటలకు భీష్మ చిత్ర గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ నితిన్, రష్మిక ఉన్న రొమాంటిక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. భీష్మ చిత్రంలోని నితిన్, రష్మిక ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్లేందుకు మేం సిద్ధం అవుతున్నాం అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ ఏఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఛలో చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన మహతి స్వర సాగర్ భీష్మకు కూడా స్వరాలు సమకూరుస్తున్నారు. 

భీష్మ చిత్రం తర్వాత నితిన్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శత్వంలో రంగ్ దే అనే చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుండడం విశేషం. అదే సమయంలో నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా నటించబోతున్నాడు.