యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ. సింగిల్ ఫరెవర్ అనేది క్యాప్షన్. చలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. నితిన్ సరసన ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. 

కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ కు యువత నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

తాజాగా నితిన్ భీష్మ చిత్ర అప్డేట్ అని అందించాడు. డిసెంబర్ 27న భీష్మ చిత్రం నుంచి తొలి పాటని రిలీజ్ చేయబోతున్నట్లు నితిన్  ప్రకటించాడు. సింగిల్ గా ఉన్న కుర్రాళ్లంతా సిద్ధంగా ఉండండి. ఇది కేవలం పాట కాదు.. మనం ఎమోషన్ అని నితిన్ ట్వీట్ చేశాడు. 

భీష్మ సింగిల్ ఫరెవర్ అంటున్న నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ లో నితిన్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు, అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.