లై - ఛల్ మోహన్ రంగ - శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలతో డిజాస్టర్స్ చూసిన తరువాత యువ కథానాయకుడు నితిన్ చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని సరికొత్త కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ 'భీష్మ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొత్తనికి సినిమా ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించి మంచి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.

ఇక నెక్స్ట్ అదే తరహాలో సక్సెస్ అందుకొవాలని నితిన్ కష్టపడుతున్నాడు. నెక్స్ట్ రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తొలి ప్రేమ - మిస్టర్ మజ్ను వంటి డిఫరెంట్ లవ్ స్టోరీస్ తో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది.

ఇక సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సమ్మర్ ఎండ్ లో జులై 31న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మొదట ఇదే డేట్ కి RRR సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ ఆ సినిమా జనవరి కి షిఫ్ట్ అవ్వడంతో నితిన్ అదే డేట్ ని ఫైనల్ చేశాడు. ఆ సమయంలో పెద్ద సినిమాలు ఎక్కువగా లేకపోవడం నితిన్ కి కలిసొచ్చే అంశం. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.