యువ  కథానాయకుడు 'నితిన్', మహానటి 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్'  నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే'.   'తొలిప్రేమ','మజ్ను' వంటి ప్రేమ కథా చిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభ గల యువ దర్శకుడు 'వెంకీ అట్లూరి' దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఈ నెల 30 న చిత్ర కథానాయకుడు నితిన్ పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని ఆదివారం 'రంగ్ దే' చిత్రం మోషన్ పోస్టర్ ను  విడుదల చేసింది చిత్రం యూనిట్. చిత్ర హీరో హీరోయిన్లు అను, అర్జున్ (నితిన్, కీర్తి సురేష్) లను  పరిచయం చేస్తూ ఈ మోషన్ పోస్టర్ రూపొందించారు. నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ 'రంగ్ దే' సినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, గాయత్రి రఘురామ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, మాస్టర్ రోనిత్ తదితరులు నటిస్తున్నారు.

ఇటీవల నితిన్‌ హీరోగా భీష్మ సినిమా ఘన విజయం సాధించింది. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నితిన్‌ కెరీర్‌ బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచింది. నితిన్‌కు జోడిగా రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమా సూపర్‌ హిట్ అయ్యింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రంగ్‌ దే తో పాటు చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ  సినిమా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాను ఎనౌన్స్‌ చేశాడు.