ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని నితిన్ భీష్మ సినిమాతో చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా సింగిల్ పాయింట్ తో యువతను ఆకర్షిస్తున్నాడు. అయితే నేడు సినిమాకీ సంబందించిన మరొక సాంగ్ ని రిలీజ్ చేశారు. కొన్నిరోజుల క్రితం రిలీజ్ చేసిన సింగిల్ ఫరెవర్ సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.

ఇక ఇప్పుడు మాస్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ..  వ్వాటే బ్యూటీ' అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే ఆ సాంగ్ లో రష్మిక మందన్న తన గ్లామర్ అందాలతో తెగ ఎట్రాక్ట్ చేసింది. అలాగే తీన్ మార్ స్టెప్పులతో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ఆకట్టుకుంది. నితిన్ కూడా సింపుల్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో ఆడియెన్స్ లో అంచనాల డోస్ గట్టిగానే పెంచుతోంది. మరీ సినిమాలో ఫుల్ సాంగ్ ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.  

ఛలో సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న  వెంకీ కుడుములు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మహతి స్వరసాగర్ సంగీతం అందించగా సూర్య దేవర నాగవంశీ సీతారా ఎంటర్టైన్మెంట్స్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. వరుస అపజయాలతో సతమతమవుతున్న నితిన్ కి ఈ సినిమా హిట్టవ్వడం చాలా అవసరం. మరీ ఈ రొమాంటిక్ డ్రామాతో తో పవన్ అభిమాని ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.