నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. వెంకీ కుడుముల ఈ చిత్రానికి రొమాంటిక్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. భీష్మ.. సింగిల్ ఫరెవర్ అనే ఆసక్తికరమైన క్యాప్షన్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఛలో చిత్రంలో వెంకీ కుడుముల మంచి హాస్యభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించాడు. రష్మిక, నాగ శౌర్య మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. 

భీష్మ చిత్రంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన భీష్మ ఫస్ట్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మూడు మిలియన్ల వ్యూస్ తో  భీష్మ ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. 

నా ప్రేమ కూడా విజయమాల్యా లాంటిదేరా.. కనిపిస్తుంది కానీ.. క్యాచ్ చేయలేము అంటూ నితిన్ ఫన్నీగా వేసిన సెటైర్ ఆకట్టుకుంది. ఇక నితిన్ రష్మిక నడుము వెంట పడుతుండడం యువతకు పిచ్చెక్కిస్తోంది. రష్మిక ఎప్పటిలాగే క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. పవన్ అభిమాని అయిన నితిన్ ఖుషి సినిమా స్పూర్తితో గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో నిత్యామీనన్ నడుము సీన్ పెట్టారు. ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ భీష్మ చిత్రంలో నితిన్ హీరోయిన్ నడుముపై ఫోకస్ పెట్టాడు. 

కేవలం 30 సెకండ్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ భీష్మ చిత్రంపై అంచనాలు పెంచిందని చెప్పొచ్చు. 2020 ఫిబ్రవరి 21న భీష్మ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో 2019 నితిన్ క్యాలెండర్ లో ఖాళీగా ముగియనుంది. ఈ ఏడాది నితిన్ నుంచి ఎలాంటి చిత్రం విడుదల కాలేదు. గత ఏడాది విడుదలైన శ్రీనివాస కళ్యాణం, ఛల్ మోహన్ రంగ చిత్రాలు నిరాశపరిచాయి. 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భీష్మ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.