యువ హీరో నితిన్ ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసితో కనిపిస్తున్నాడు. ఛల్ మోహన్ రంగ - లై సినిమాలతో ఊహించని డిజాస్టర్స్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు భీష్మ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇక నేడు సినిమాకు సంబందించిన ఫస్ట్ గ్లిoప్స్ ని రిలీజ్ చేశారు. చూస్తుంటే నితిన్ సినిమాలో చాలా డిఫరెంట్ హావభావాలతో కనిపిస్తున్నాడు.

ఇక మరోసారి అమ్మాయి నడుమును ఫోకస్ చేసినట్లు సీన్ ఉండడం బావుంది.  నా లవ్వు కూడా విజయ్ మాల్యా లాంటిదిరా - కనిపిస్తుంది కానీ క్యాచ్ చేయలేము. అని నితిన్ చెప్పిన డైలాగ్ లో చాలా అర్దాలు కనిపిస్తున్నాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఛలో దర్శకుడు  వెంకీ కుడుములు తెరకెక్కిస్తున్నాడు. చిత్ర యూనిట్ ప్రత్యేకంగా త్రివిక్రమ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. 

ఇక రష్మిక మందన్న పాత్ర కూడా సినిమాలో హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. నువ్వు అందుకే సింగిల్ గా ఉన్నవా? అని ఆమె సోషల్ మీడియాలో  చేసిన స్పెషల్ ట్వీట్ కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.  ఈ ఏడాది చివరిలోగా వస్తుంది అనుకున్న ఈ సినిమా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది.

2020 ఫిబ్రవరి 21న సినిమాను విడుదల చేయనున్నట్లు ఏ ప్రీ టీజర్ తో క్లారిటీ ఇచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ ఏఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఛలో చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన మహతి స్వర సాగర్ భీష్మకు కూడా స్వరాలు సమకూరుస్తున్నారు.

భీష్మ చిత్రం తర్వాత నితిన్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శత్వంలో రంగ్ దే అనే చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుండడం విశేషం. అదే సమయంలో నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా నటించబోతున్నాడు.