లై - ఛల్ మోహన్ రంగ - శ్రీనివాస కళ్యాణం వంటి హ్యాట్రిక్ డిజాస్టర్స్ తరువాత యువ హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని సరికొత్త కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ 'భీష్మ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పలు దేశాల్లో ప్రీమియర్స్ ముగించుకున్న ఈ సినిమాకు చాలా వరకు పాజిటివ్ టాక్ అందుతోంది.

మెయిన్ గా మాస్ ఆడియెన్స్ ఎక్కువగా లైక్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది.  ఇక సినిమా చూసిన కొంత మంది అభిమానులు ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నితిన్ గట్టిగా కొట్టేశాడనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కామెడీ టైమింగ్ డ్యాన్స్ తో ఇరగదీశాడని ఫస్ట్ హాఫ్ అంతా వన్ మ్యాన్ షో గా కథను నడిపించడానికి టాక్ వస్తోంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాలో హైలెట్ అని చెబుతున్నారు. ఇక స్టోరీ లైన్ తెరకెక్కించిన విధానం బావుందని డైరెక్టర్ వెంకీ కుడుముల పనితనాన్ని మెచ్చుకుంటున్నారు.

పాజిటివ్ కామెంట్స్ తో పాటు ఓ వర్గం ఆడియెన్స్ నుంచి సినిమాకు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. రొటీన్ కమర్షియల్ మూవీ అంటూ.. ఈ వీకెండ్ లో పరవాలేధనిపించే ఒక డీసెంట్ మూవీ అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కొంత మిక్సిడ్ టాక్ అందుకుంటున్న భీష్మ వీకెండ్ లో కలెక్షన్స్ ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. సీతారా ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్స్ గా నటించింది.