Asianet News TeluguAsianet News Telugu

ఆ సినిమాపై అనుష్కకే ఆసక్తి లేదా.. రూమర్లపై క్లారిటీ

స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ అనుష్క సొతం. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసి అనుష్క.. లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో టీనా నట విశ్వరూపం ప్రదర్శించింది.

Nishabdam team responds to rumours on Anushka shetty
Author
Hyderabad, First Published Apr 21, 2020, 4:44 PM IST

స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ అనుష్క సొతం. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసి అనుష్క.. లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో టీనా నట విశ్వరూపం ప్రదర్శించింది. బాహుబలి నాటి భారీ విజయంతో అనుష్క ఇండియా వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది. 

కానీ అనుష్క కెరీర్ మాత్రం అంత జోరుగా సాగడం లేదు. అనుష్క తో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు సిద్దంగానే ఉన్నపటికీ కొత్త ప్రాజెక్ట్స్ కు సైన్ చేసేందుకు ఆమె ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉండగా అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం అనే చిత్రంలో అంటిస్తోంది. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడు. 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంతగా బజ్ లేదు. బహుశా లాక్ డౌన్ తర్వాత ప్రచార కార్యక్రమాలతో బజ్ క్రియేట్ చేస్తారేమోచూడాలి. 

ఓ షాకింగ్ రూమర్  అనుష్క గురించి వైరల్ అవుతోంది. అనుష్కకు అసలు నిశ్శబ్దం చిత్రంపై ఆసక్తి లేదని అంటున్నారు. నమ మాత్రంగానే అనుష్క ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటోందనే ప్రచారం వైరల్ అవుతోంది. దీనిపై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ స్పందించింది. అనుష్క గురించి వస్తున్న కథనాలన్నీ అవాస్తవం అని తేల్చేసింది. ఈ చిత్రంలో అంజలి, మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios