2017లో వచ్చిన నిన్నుకోరి సినిమా టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నాని, నివేత థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమా మాస్ ఆడియెన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఇప్పుడు వివిధ భాషల్లో రీమేక్ కానుంది. సినిమాలో నటించడానికి పరభాషా హీరోలు ఎగబడుతున్నారట.

ఇప్పటికే తమిళ్ లో రీమేక్ పనులు మొదలయ్యాయి.  నాని నటించిన పాత్రలో అథర్వా నటించనున్నాడు. బాలీవుడ్ లో కూడా కొంత మంది కుర్ర హీరోలు రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్లు టాక్.  ఇక కన్నడ లో కూడా నిన్నుకోరి సినిమాను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధృవ్ సర్జా కథానాయకుడిగా నటించనున్న ఆ సినిమాకు కన్నడ ప్రముఖ దర్శకుడు నంద కిషోర్ దర్శకత్వం వహించనున్నాడు. రీసెంట్ గా సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 

ఇక తమిళ్ రీమేక్ కి దర్శకుడు కన్నన్ హీరోయిన్ విషయంలో వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చాడు. తెలుగులో నివేత థామస్ నటించిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఆమెనే ఈ సినిమా కోసం ఎంచుకున్నట్లు టాక్ వచ్చింది. ఫైనల్ గా దర్శకుడు అనుపమను కథానాయికగా సెలక్ట్ చేసుకున్నట్లు చెప్పాడు. అయితే ఆది చేసిన కీలక పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయాన్నీ దర్శకుడు చెప్పలేదు. మళ్ళీ ఆధి వైపే మొగ్గు చూపుతారా లేక వేరే నటుల్ని ఎంచుకుంటారా అనేది వేచి చూడాలి.