టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోల్లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అందులో నిఖిల్ సిద్దార్థ్ ఒకరు. అవకాశం వచ్చిన ప్రతిసారి ఎదో ఒక్క తారహా పాయింట్ ని తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కేశవా సినిమా అనంతరం నిఖిల్ పెద్దగా సక్సెస్ అందుకోలేదు. కిర్రాక్ పార్టీ డిజాస్టర్ అవ్వడంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అర్జున్ సురవరం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ సినిమా కోసం చాలా కష్టపడినట్లు నిఖిల్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు పడిన కష్టాలు నా 17 సినిమాలకు పడలేదు. క హానెస్ట్ ఫిల్మ్ ని మీ దగ్గరికి తీసుకురావాలన్న ప్రయత్నమే ఇది. అర్జున్ సురవరం ట్రైలర్ నచ్చితే అందరికి షేర్ చేయండి అని నిఖిల్ పేర్కొన్నారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. మంచి థ్రిల్లింగ్ అంశాలతో మరోసారి నిఖిల్ సరికొత్తగా ఎట్రాక్ట్ చేయనున్నట్లు అర్ధమవుతోంది.  తమిళ్ కనిథన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన అర్జున్ సురవరం మొదటి నుంచి వివాదాల్లో చిక్కుకుంటూ వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమాకు మొదట ముద్ర అనే టైటిల్ ని సెట్ చేశారు.

అప్పుడు టాలీవుడ్ లో ఆ టైటిల్ వివాదం ఎక్కువగా నడిచింది. ఇక ఇప్పుడు అర్జున్ సురవరం టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక రిపోర్టర్ కి ఎదురైనా సమస్యను అతను బాధ్యతగా ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమాలో మెయిన్ పాయింట్. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు బి.మధు నిర్మించారు. ఇక హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి కనిపించనుంది. ఫైనల్ గా ఈ సినిమాను ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.