మంచు లక్ష్మి గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్ ని తన కొత్త డిజిటల్ షోతో షేక్ చేస్తోంది. స్టార్స్ ని బోల్డ్ గా ఇంటర్వ్యూ చేస్తూ ఆడియెన్స్ ని షాక్ కి గురి చేస్తోంది. ఇటీవల వరుణ్ తేజ్ - శృతి హాసన్ అలాగే మరికొంత మంది స్టార్స్ ఊహించని సమాధానాలు ఇచ్చి హాట్ టాపిక్ గా నిలిచారు. ఇక ఇప్పుడు మరో యువ హీరో లక్ష్మి  ఫీట్ అప్ విత్ ది స్టార్స్ షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. 

ముందుగా వంటిమీద తనకు చొక్కా ఉంటె నచ్చదు అంటూ లక్ష్మి ముందే షర్ట్ విప్పేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. అలాగే బోల్డ్ ప్రశ్నలకు అదే స్టామినాతో ఆన్సర్ ఇస్తూ సరదాగా నడిపించాడు. మెయిన్ గా హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ఒక స్పెషల్ కామెంట్ కూడా చేశాడు. ఆమె సెట్ కు వస్తే అందరూ ఆమె వైపు తిరిగేస్తారు అని చెప్పి ఆమె అందం గురించి పొగిడాడు.    

డిజిటల్ ఫ్లాట్ ఫర్మ్  వూట్ లో ఈ షో నేడు ప్రసారం కానుంది. ప్రోమోలోనే నిఖిల్ ఈ రేంజ్ లో షాకిచ్చాడు అంటే ఫుల్ ఎపిసోడ్ లో ఎలాంటి సమాధానాలు ఇచ్చి ఉంటాడో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ అర్జున్ సురవరం సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే కార్తికేయ సీక్వెల్ ని కూడా సెట్స్ పైకి తేవడానికి నిఖిల్ సిద్దమవుతున్నాడు.