జేడీఎస్ అధినేత కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ మరో బిగ్ ప్రాజెక్ట్ కి ప్లాన్ చేసుకుంటున్నాడు. 2016 లో జాగ్వార్ సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. అప్పట్లో నిఖిల్ జాగ్వార్ సినిమా సక్సెస్ కావాలని అంచనాలకు తగ్గట్టుగా 60 కోట్లకు పైగా ఖర్చు చేశారు. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.

అయితే జాగ్వార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం క్లిక్కవ్వలేకపోయింది. పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకురాలేక సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు మరో సోషల్ మెస్సేజ్ కథను కొడుకుకు సెట్ చేయాలనీ కుమారస్వామి బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియన్ సినిమాగా ప్రజెంట్ చేయాలనీ ఆలోచిస్తున్నారట.ఆ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించనున్నాడు.

నితిన్ తో గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాతో మెప్పించిన విజయ్ ఆ తరువాత నాగ చైతన్యతో ఒక లైలా కోసం అనే సినిమా చేశాడు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్టవ్వలేదు. గత కొంత కాలంగా స్క్రిప్ పనుల్లో బిజీగా ఉన్న విజయ్ కుమార్ కు సడన్ గా సీఎం కుమార స్వామి నుంచి అఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం డైరెక్టర్ విజయ్ రాజ్ తరుణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మరోవైపు నిఖిల్ గౌడ కూడా రెండు కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు అయిపోగానే విజయ్ ప్రాజెక్టును కుమార స్వామి స్టార్ట్ చేయించనున్నట్లు సమాచారం.