సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయటం సాధారణంగా జరిగే విషయం. ఇందులో అభ్యంతరమూ లేదు అసంగతమూ లేదు. అయితే యావరేజ్ అనిపించుకున్న సినిమాలు సైతం సీక్వెల్స్  అంటూ హోరెత్తితేనే అది రాజుగారి గది సీక్వెల్స్ లా చిరాకేస్తుంది. ఇప్పుడు నిఖిల్ హీరోగా వచ్చిన అర్జున్ సురవరం సినిమా ...సో సో గా ఉంది, ఫరవాలేదు , యావరేజ్, ఓ నాలుగు రోజులు కలెక్షన్స్ వస్తే హిట్ అనొచ్చు అనే టాక్ వచ్చింది. హమ్మయ్య ఫ్లాఫ్ బాధ తప్పిందే , రిలీఫ్ అయ్యాను అని ఆనందపడకుండా సీక్వెల్స్ తీస్తానంటూ ఉత్సాహపడుతున్నాడట నిఖిల్.

యంగ్ హీరో నిఖిల్  హీరోగా న‌టించిన అర్జున్ సుర‌వ‌రం ఇటీవ‌ల విడుద‌లై  పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.  రివ్యూలు కొంచెం అటూ  ఇటూ గా ఉన్నా... సినిమాకు మాత్రం మంచి కలెక్షన్స్  ల‌భిస్తున్నాయి. రివ్యూల‌కు అతీతంగా సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రాణించటం నిఖిల్ ఆనందాన్ని కలగచేస్తోంది. నిఖిల్ ఇప్పుడున్న పరిస్దితుల్లో ఓపినింగ్స్, ఫస్ట్ వీక్ వ‌సూళ్లు బాగున్నాయ‌ని తెలుస్తోంది.  కొన్ని ఏరియాల్లో అద‌నంగా థియేట‌ర్లు కూడా పెంచారు. ఈ నేపధ్యంలో నిఖిల్ కు సీక్వెల్ ఐడియా వచ్చిందట.

హీరో సందీప్ కిషన్ కొత్త కారు అదిరింది!

అర్జున్ సుర‌వ‌రంకు సీక్వెల్ తీసేయ్యాలని దర్శకుడుకు పురమాయించాడట. దాంతో ఆ డైరక్టర్ ఆనందంతో ప్రెండ్స్ కు పార్టీలు గట్రా ఇచ్చేస్తున్నాడు.  అలాగే ఇప్ప‌టికే తనకు పార్ట్ 2 ఐడియా ద‌ర్శ‌కుడు టి.ఎన్ సంతోష్  చెప్పాడట.  అయితే అర్జున్ సురవ‌రంకి అసలు ప‌రీక్ష  రేపటి నుంచి మంగళ వారం నుంచి ఎదురు కానుంది. సోమవారం షష్టి సందర్బంగా ఆంధ్రాలో పాసై పోతుంది.

దాంతో అర్జున్ సుర‌వ‌రం కు సంబంధించిన  ఫైనల్ రిపోర్ట్ వచ్చిన  త‌ర్వాత దీని గురించి ఆలోచిస్తే మంచిదని ట్రేడ్ అంటోంది. ఈ విషయమై త్వరలోనే అప్ డేట్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ సీక్వెల్  చేస్తే గ‌నుక ఇదే టీమ్ తో ముందుకువెళ్దామని నిఖిల్ చెప్పినట్లు  తెలుస్తోంది.
 
ప్రస్తుతానికి బాక్సాఫీస్ సైడ్ నుంచి నిఖిల్ కు ఎలాంటి పోటీ లేదు. రాగల 24 గంటల్లో, జార్జ్ రెడ్డి సినిమాలు పెద్దగా నడవడం లేదు. తోలుబొమ్మలాట ఫ్లాప్. యాక్షన్, తెనాలి, తిప్పరామీసం లాంటి సినిమాలు ఎప్పుడో దుకాణం సర్దేయటం కలిసి వచ్చే అంశం.

నిర్మాత ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్‌ ఎల్‌ ఎల్‌ పి పతాకంపై రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా నవంబర్ 29న విడుదల అయ్యింది.  నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటించిన ఈ చిత్రాన్ని  కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. శ్యామ్ సిఎస్ సంగీతం అందించారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు న‌టించారు.