Asianet News TeluguAsianet News Telugu

నిఖిల్ 'అర్జున్ సురవరం' రిలీజ్ కి రెడీ!

దీపావ‌ళి సంద‌ర్భంగా 'అర్జున్ సురవరం' సినిమా రిలీజ్ డేట్‌ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల విష‌యంలో కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది

Nikhil's Arjun Suravaram Release on November 29th
Author
Hyderabad, First Published Oct 26, 2019, 1:49 PM IST

యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాత ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో.. బ్యాన‌ర్‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ అకెళ్ల నిర్మించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'అర్జున్ సుర‌వ‌రం'. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల విష‌యంలో కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది. ఈ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. న‌వంబ‌ర్ 29న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

సినిమాకి రూ.3 కోట్లు.. నిర్మాతలకు భారంగా మారిన దేవిశ్రీప్రసాద్!

నిఖిల్ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించింది. పోసాని కృష్ణ‌ముర‌ళి, సత్య‌, త‌రుణ్ అరోరా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ సినిమా టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

న‌టీన‌టులు:
నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: టి.సంతోష్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు
నిర్మాత‌: రాజ్‌కుమార్ అకెళ్ల‌
సంగీతం: సామ్ సి.ఎస్‌
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య‌
ఎడిట‌ర్: న‌వీన్ నూలి

Nikhil's Arjun Suravaram Release on November 29th

Follow Us:
Download App:
  • android
  • ios