ఒక హీరోతో అనుకున్న సినిమా ...తర్వాత కాలంలో మరో హీరో తో సెట్ అవటం అనేది ఇండస్ట్రీలో కామన్ విషయమే. చాలా సార్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే కొందరు వీటిని లైట్ తీసుకునే పరిస్దితి ఉంటే... మరికొందరికి బాధ కలిగిస్తుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే రాజ్ తరణ్ కు జరిగిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. రాజ్ తరుణ్ తో అనుకున్న ప్రాజెక్టు ఊహించని విధంగా నిఖిల్ చేతిలోకి వచ్చిందిట.

ఇంతకీ ఆ ప్రాజెక్టు మరేదో కాదు..నిఖిల్ హీరోగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా రాబోతున్న సినిమానే. ఈ సినిమాకు మొదట రాజ్ తరుణ్ హీరోగా అనుకుని సినిమా ప్లాన్ చేసారు. అయితే  రాజ్ తరుణ్ డేట్స్ విషయం తేల్చకపోవటటం, అర్జున్ సురవంతో నిఖిల్ ఫామ్ లోకి రావటం కలిసి వచ్చిన అశం. దాంతో ఇప్పుడు రాజ్ తరుణ్ ఇంత ప్రెస్టేజియస్ ప్రాజెక్టు వేరే వాళ్లకు వెళ్లిపోవటంతో చాలా బాధగా ఉన్నాడట. దిల్ రాజు నిర్మాతగా త్వరలో రాబోతున్న ఇద్దరి లోకం ఒకటే చిత్రంపై పూర్తి ఆశలు పెట్టుకున్న రాజ్ తరుణ్ వేరే ఆఫర్స్ ఒప్పుకునేందుకు తటపాయిస్తున్నాడట. నిఖిల్ మాత్రం వెంటనే మరో హిట్ కొట్టి తనకు వచ్చిన గ్యాప్ ని తగ్గించుకోవాలనుకుంటున్నాడట.  

గతంలోనూ తన దగ్గరకు వచ్చిన శతమానం భవతి, నేను లోకల్, ఎక్కడికి పోతావు చిన్న వాడ సినిమాలను రాజ్ తరణ్ వదేలేలుకున్నాడు. అవన్నీ మంచి హిట్స్ అయ్యాయి. ఇప్పుడీ ప్రాజెక్టు కూడా  మంచి హిట్ అయ్యే కథ,కథనంతో రెడీ అయ్యిందని తెలుస్తోంది.  సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ రోల్ వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన నటించే హీరోయిన్ ఎవరు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. అలాగే ఈ సినిమాకు సంబంధించి మిగిలిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.