ఎన్నో డిఫరెంట్ సినిమాలతో యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో నిఖిల్ సిద్దార్థ్. కిర్రాక్ పార్టీ సినిమాతో డిజాస్టర్ అందుకున్న నిఖిల్ ఆ తరువాత చేసిన చిత్రం అర్జున్ సురవరం. ఈ సినిమా గత కొంత కాలంగా వాయిదాలు పడుతున్న విషయం తెలిసిందే. కియా మొత్తానికి కష్టపడి నేడు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

సినిమా ప్రీమియర్స్ చూసిన నెటిజన్స్ సినిమాపై ఎక్కువగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ల స్కామ్ నేపథ్యంలో తమిళంలో తెరకెక్కిన కనితన్ సినిమాకు ఈ సినిమా రీమేక్. సినిమ్లో ట్విస్ట్ అలాగే నిఖిల్ పర్ఫెమెన్స్ కి ప్రశంసలు అందుతున్నాయి. ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ టీఎన్ సంతోష్ ఈ తెలుగు వెర్షన్ ని సైతం డైరక్ట్ చేసారు.

126 నిముషాల నిడివిగల ఈ సినిమాలో కొన్ని చిరాకు తెప్పించే సన్నివేశాలు కూడా ఉన్నాయనే టాక్ వస్తోంది. అలాగే వీకెండ్ లో చూడదగిన సినిమా అంటూ మరికొందరు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఎక్కువగా మెగా అభిమానుల నుంచి మద్దతు లభిస్తోందని చెప్పాలి. మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడంతో అర్జున్ సురవరంకి మంచి బూస్ట్ వచ్చింది.  అదే ఫ్లోలో సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ కూడా వస్తోంది. చూస్తుంటే నిఖిల్ మినిమమ్ హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. ఇక మరోవైపు హీరోయిన్ లావణ్య త్రిపాఠికి కూడా మంచి మార్కులే పడుతున్నాయి. మరి సినిమా మొత్తంగా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.