మెగా డాటర్ నిహారిక కొణిదెల తనకు కాబోయే వరుడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెన్సీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న చైతన్య జొన్నలగడ్డ తో నిహారిక పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. చైతన్య గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు తనయుడు. 

చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కలిసి వెళ్లి ఈ వివాహం పైనలైజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక స్వయంగా నిహారికే తనకు కాబోయేవాడి గురించి చెప్పడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇక అప్పటి నుండి వీరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు, పెళ్లి ముహూర్తం, ఎప్పుడు అనే ఆతృత అభిమానుల్లో ఎక్కువయింది. 

నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ తాజగా నిహారిక ఎంగేజ్మెంట్ ఆగష్టు 13వ తేదీన నిర్వహించేందుకు పెద్దలు డిసైడ్ అయ్యారని తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలియవస్తుంది. 

డిసెంబర్ లో పెళ్లి జరిపించడానికి ఇరు కుటుంబ సభ్యులు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్టు తెలియవస్తుంది. నిహారిక, చైతన్యలు ఇద్దరి మధ్య గత కొంత కాలంగా పరిచయం ఉంది. అదే వీరిని పెళ్లిపీటలెక్కించింది.