రోనా కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమిత మయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు తారలు. తాజగా మెగా డాటర్‌ నిహారిక కూడా యాంకర్‌ రవితో కలిసి లైఫ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. మెగా వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన నిహారిక ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా అవి సక్సెస్‌ కాకపోవటంతో సైలెంట్‌ అయిపోయింది.

ఇటీవల సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమాలో చిన్న రోల్‌ లో కనిపించినా  అది కూడా నిహారికకు కలిసి రాలేదు. దీంతో ప్రస్తుతానికి వెబ్‌ సిరీస్‌లతో సరిపెట్టుకుంటుంది ఈ బ్యూటీ. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇక వచ్చి ప్రతీ మంచి అవకాశాన్ని వినియోగించుకుంటు సినిమాలు చేస్తా అని చెప్పింది. అంటే త్వరలోనే ఈ భామ నటనకు గుడ్‌ బై చెప్పబోతుందా..? పెళ్లి చేసుకొని పర్సనల్‌ లైఫ్‌లో సెటిల్‌ అయ్యే ఆలోచనలో ఉందా అన్న అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి.

అదే సమయంలో పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తారా..? అన్న ప్రశ్నకు సమాధానంగా.. నేనేమన్న సమంతనా పెళ్లి తరువాత కూడా నటిస్తానని ఇప్పుడే చెప్పడానికి అంటూ కౌంటర్‌ ఇచ్చింది. అయితే ఏది ఏమైనా మెగా ఫ్యామిలీలో త్వరలో మరో భారీ వేడుక జరగనుందన్న హింట్ మాత్రం ఇచ్చింది నిహారిక. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా తన సొంత నిర్మాణ సంస్థలో వెబ్ సిరీస్‌లను నిర్మిస్తూ బిజీగా ఉంది ఈ భామ.