మెగా వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన భామ నిహారిక కొనిదెల. నాగ బాబు కూతురు నిహారికి హీరోయిన్‌గా పరిచయం అవుతుందంటే అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండటంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. అయితే వెండితెర మీద ఈ భామకు అదృష్టం అస్సలు కలిసి రాలేదు. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్‌ కావటంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

అయితే ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన నిహారిక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిహారిక. కొంత కాలం మాత్రమే సినిమాలు చేస్తానని చెప్పటంతో త్వరలోనే నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్‌. అయితే కొంత కాలం గ్లామర్స్‌ రోల్స్‌లో నటించడానికి కూడా రెడీ అంటూ ప్రకటించేసింది ఈ బ్యూటీ. కానీ నిహారిక చేస్తానన్న ఫ్యాన్స్‌ యాక్సెప్ట్ చేస్తారా..? అసలు దర్శక నిర్మాతలు నిహారికకు అలాంటి క్యారెక్టర్స్ ఇస్తారా.? అన్న అనుమానాలుకూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ సందర్భంగా ఓ అభిమాని గతంలో ప్రభాస్‌ను నిహారిక పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వచ్చిన వార్తలను ఆమెతో ప్రస్తావించాడు. ` మీరు ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటున్నట్టుగా వచ్చిన వార్తలు నిజమేనా?` అంటూ నిహారికను అడిగాడు. `అందరినీ నిరాశపరుస్తున్నందుకు క్షమించండి. ఆ వార్తలన్నీ రూమర్స్‌. నేను ప్రభాస్‌ను లవ్ చేయడం లేదు, పెళ్లి చేసుకోబోవటం లేదు` అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ తన సొంత నిర్మాణ సంస్థలో వెబ్ సిరిస్‌లను నిర్మిస్తూ బిజీగా ఉంది.