కంటికి క‌నిపించ‌ని వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ల‌క్ష‌ల మందిని పొట్ట‌న పెట్టుకున్న ఈ క‌రోనా రోజు రోజుకీ మరింత విజృంభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు ఈ భూమిని వీడిపోతుందో ఎవ‌రికి అర్ధం కాని ప‌రిస్థితిలో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. క‌రోనా వ‌ల‌న ఇప్ప‌టికే అనేక మంది సెలబ్రెటీలు, హాలీవుడ్ న‌టులు, సింగ‌ర్స్ మృత్యువాత ప‌డ్డారు. తాజాగా 41 ఏళ్ల హాలీవుడ్ న‌టుడు క‌రోనా వ‌ల‌న కాలునే కోల్పోవ‌ల‌సి వ‌చ్చింది. 

వివరాల్లోకివెళితే...మాబ్ టౌన్, ఇన్ సైడ్ గేమ్, ఎ స్టాండ్ అప్ గై వంటి అనేక చిత్రాల్లో నటించిన అమెరికాకు చెందిన నటుడు నిక్ కార్డెరోకి కొద్ది రోజుల క్రితం క‌రోనా పాజిటివ్ అని తేలింది. మూడు వారాల పాటు అత‌నికి ఐసీయూలో చికిత్స అందించారు. . దీంతో అతని కుడి కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి, ముక్కలుగా విడిపోయింది. ఇది ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాలకే ముప్పు సంభవించే అవకాశం ఉంది. దీంతో, తప్పనిసరి పరిస్థితుల్లో అతని కాలును వైద్యులు తొలగించారు. న్యూయార్క్‌లో కూడా ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి జ‌ర‌గ‌గా, చేతి వేలిని తీసేశారు వైద్యులు. అయితే ప్ర‌స్తుతం నిక్ కార్డెరో కోమాలో ఉన్న‌ట్టు తెలుస్తుంది. 

మ‌రోవైపు నిక్ ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ట్టు వార్తలువస్తున్నాయి. డాక్టర్లు.. అతన్ని.., వైద్యులు సాధార‌ణ స్థితికి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే అత‌ని ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంద‌నే ఆశాభావం వ్య‌క్తం చేస్తుంది నిక్ భార్య అమండ క్లూట్స్.