భారతదేశం గర్వించదగ్గ నటులలో కమల్ హాసన్ ఒకరు. తన విలక్షణ నటనతో ఆరు దశాబ్దాలుగా కమల్ సినీ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఇటీవల ఆయన రాజకీయ రంగప్రవేశం చేసి సొంతంగా పార్టీ కూడా స్థాపించారు. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2లో నటిస్తున్నారు. 

ఇదిలా ఉండగా కమల్ హాసన్ తన జన్మదిన వేడుకల్ని కుటుంబ సభ్యులతో కలసి తన సొంత గ్రామం పరమకుడిలో జరుపుకున్నారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్ కుటుంబ సభ్యులు మొత్తం సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. కమల్ పెద్ద అన్నయ్య చారు హాసన్.. ఆయన కుమార్తె సుహాసిని,.. అలాగే కమల్ కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్ కూడా ఉన్నారు. 

కుటుంబ సభ్యులంతా కలసి దిగిన ఫొటోలో ఓ కొత్త వ్యక్తి కూడా కనిపిస్తున్నారు. ఆమె మరెవరో కాదు విశ్వరూపం హీరోయిన్ పూజా కుమార్. కమల్ హాసన్ ఫ్యామిలీ పిక్ లో పూజా కుమార్ ఎందుకు ఉంది అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. ఆమెపై అనేక రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. 

కమల్ హాసన్ తో కలసి పూజా కుమార్ విశ్వరూపం చిత్రంలో నటించింది. ఆ తర్వాత వచ్చిన ఉత్తమ విలన్ చిత్రంలో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. విశ్వరూపం2లో కూడా పూజా కుమార్ ని హీరోయిన్ గా కొనసాగించారు. 

కమల్ హాసన్ బర్త్ డే వేడుకలకు చాలా ప్రైవేట్ గా సొంత గ్రామంలో జరిగాయి. కమల్ కుటుంబ సభ్యులు తప్పఇతరులు హాజరు కాలేదు. కానీ పూజ కుమార్ మాత్రంమే హాజరు కావడం ఆసక్తిగా మారింది. 

కమల్ హాసన్ 1978లో నటి వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. పదేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కమల్ మరో నటి సారికని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి సంతానమే శృతి హాసన్, అక్షర హాసన్. సారిక నుంచి విడిపోయాక కమల్ హాసన్ ప్రముఖ నటి గౌతమితో కొంతకాలం సహజీవనం చేశారు. రెండేళ్ల క్రితం వీరిద్దరు కూడా విడిపోయిన సంగతి తెలిసిందే.