సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరించే బాలీవుడ్‌ అందాల భామ నేహా శర్మ. ప్రస్తుతం కరోనా వైరస్‌ భయంతో వణికిపోతున్న ప్రజలకు కాస్త ఊరటనిచ్చే విధంగా ఓ హాట్ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది నేహా. ఇన్నర్‌ వేర్‌తో ఉన్న తన అందాలను ప్రదర్శిస్తూ వైట్ రోబ్‌ కప్పుకొని ఉన్న నేహా శర్మ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ ఫోటోతో పాటు `ప్రస్తుతం బయట ఉన్న అత్యవసర పరిస్థితుల నుంచి కొంచెం డిస్ట్రాక్షన్‌. హ్యాపీ మండే. ఇంటి దగ్గరే ఉండండి. జాగ్రత్తగా ఉండండి` అంటూ కామెంట్ చేసింది.

ఈ ఫోటోపై నెటిజెన్లు కూడా ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. `నేహ అధికారికంగా ఒప్పుకుంది. ఆమె ఫోటోలన్ని కుర్రాలకు వల వేసేందుకే అని` కామెంట్ చేయగా, మరో నెటిజెన్‌ `దీన్నే సమాజ సేవ అంటారు` అంటూ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి `ఈమె మీరు ఇంటి దగ్గరే కూర్చొని తన ఫోటోనే చూసే విధంగా చేస్తోంది, ఎవరూ బయటకు వెళ్లకండి` అంటూ రిప్లై ఇచ్చారు. మరో వ్యక్తి సరదాగా `ఈమె మనకోసం ఎంత కేర్ తీసుకుంటుందో చూడండి` అంటూ కామెంట్‌ చేసింది.

12 ఏళ్ల క్రితం వెండితెరకు పరిచయం అయిన నేహా శర్మ, బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లోనూ నటించింది. చివరగా అనిల్ కపూర్‌, అర్జున్‌ కపూర్‌లు కలిసి నటించిన ముబారకన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది నేహా. ఇటీవల అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ చిత్రం తానాజీలోనూ కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం బిజోయ్‌ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది నేహ.