సోషల్ మీడియాలో అత్యదిక ఫాలోవర్స్ కలిగిన ఇండియన్ స్టార్స్ లో అమితాబ్ బచ్చన్ ఒకరు. ఆయన చిన్న ట్వీట్ చేసినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. 77ఏళ్ల వయసులో కూడా అమితాబ్ చురుగ్గా ఉంటూ నేటి యువతరానికి ఛాలెంజ్ విసురుతూ ఉంటారు. ఇకపోతే ఆయన రీసెంట్ గా చేసిన ఒక ట్వీట్ అందరిని షాక్ కి గురి చేసింది. 

కరోనా వైరస్ ని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనతా బంద్ లో బాగంగా వైద్య సిబ్బందిని చప్పట్లతో అభినందించాలని మోడీ ఇచ్చిన పిలుపికి అందరు మద్దతు పలికిన విషయం తెలిసిందే.

అయితే అమితాబ్ మాత్రం పప్పులో కాలేశారని నెటీజన్స్ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం దేశమంతా చప్పట్లతో దేశ వైద్యులకు అభినందనలు తెలిపారు. అయితే అమితాబ్ మాత్రం చప్పట్లు వెనుక ఒక నమ్మకం గురించి ట్వీట్ చేశారు. ఆదివారం అమావాస్య గనక ఆ రోజు చప్పట్లు కొడితే చంద్రుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడాని, శంఖం, ఇతర ధ్వనిలతో వైరస్, బ్యాక్టీరియాలు ఇట్టే నశిస్తాయని ట్వీట్ చేశారు.

దీంతో నెటీజన్స్ ఆయన్ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢ నమ్మకాలు ఏమిటని మీలాంటి వారు ఇలాంటి వాట్సాప్ ఫార్వార్డ్ మెస్సేజ్ లు పోస్ట్ చేయకూడదని నెటీజన్స్ కామెంట్ చేశారు. దీంతో వెంటనే అమితాబ్ ఆ ట్వీట్ ని డిలీట్ చేశారు. ఏదేమైనా అది ప్రకటన కాదని, ఒక డిస్ క్లైమార్ అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.