ప్రముఖ బుల్లితెర నటి కామ్యా పంజాబీ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకి గతంలోనే పెళ్లి జరిగింది. పన్నెండేళ్ల కూతురు కూడా ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 40 ఏళ్లు. ఎదుగుతున్న కూతురుని పెట్టుకొని ఈ వయసులో రెండో పెళ్లి చేసుకున్న కామ్యాని సోషల్ మీడియాలో నెటిజన్లు టార్గెట్ చేశారు.

ఆమెపై అసభ్యపదజాలంతో కామెంట్స్ పెట్టారు. కూతురిని పెట్టుకొని మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. అయితే ఈ విషయంపై కామ్యా స్పందించలేదు కానీ ఈ కామెంట్స్ చూసిన కామ్యా స్నేహితురాలు నటి కవితా కౌశిక్ ఊరుకోలేకపోయింది.

టీవీ నటుడిపై లైంగిక వేధింపుల కేసు!

సదరు నెటిజన్ ని టార్గెట్ చేస్తూ ఘాటుగా బదులిచ్చింది. జీవితాంతం భర్త తోడుగా ఉంటాడని కాబట్టి పెళ్లి చేసుకుంటారని.. పిల్లల్ని కనడం కంటే జీవితంలో ఇంకా ఎంతో ఉంటుందని.. ఏదోక రకంగా ఆనందం వెతుక్కోవాలని అనుకుంటున్న వారిలో తప్పులు వెతికి వేలెత్తి చూపకండి అని చెప్పింది.

ఇతరులు సంతోషంగా ఉంటున్న సమయంలో వారిని సిల్లీ ప్రశ్నలు అడగకుండా మీరు కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి అంటూ సలహా ఇచ్చింది. సెలబ్రిటీలను టార్గెట్ చేసి వారిని ట్రోల్ చేయడం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా ఓసారి కామ్యాని ట్రోల్ చేశారు.

తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించగానే.. ఇలాంటి నటితో డేటింగ్ ఎందుకు చేస్తున్నావ్..? అని అతడి ప్రియుడిని ప్రశ్నించారు. ఇతర మహిళలను తక్కువ చేసి మాట్లాడి తన పరువు తనే తీసుకుంటుందని.. అవసరం కోసం ఆమె తన కూతురిని కూడా అమ్మేసే టైప్ అంటూ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో కామ్యా భర్త కామెంట్స్ చేసిన నెటిజన్లపై ఫైర్ అయ్యాడు. ఇంత నీచంగా మాట్లాడే హక్కు మీకు లేదని మండిపడ్డాడు.