మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైంది చిరుత చిత్రంతో. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చరణ్ ని చిరుత చిత్రంలో స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు. రామ్ చరణ్ సరసన యంగ్ బ్యూటీ నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. 

వీరిద్దరి పెయిర్ కు చిరుత చిత్రంలో మంచి మార్కులు పడ్డాయి. రామ్ చరణ్ డాన్సులతో అదరగొట్టగా.. నేహా శర్మ అందచందాలు ఆరబోసింది. పూరి టేకింగ్ కూడా బావుండడంతో చిరుత చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. 

చిరుత తర్వాత నేహా శర్మ కుర్రాడు అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత నేహా శర్మ టాలీవుడ్ కు దూరమైంది. బాలీవుడ్ పైనే దృష్టిపెటింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్లీవేజ్ అందాలని కుర్రాళ్లకు ఎరగా వేస్తోంది. తాజాగా నేహా శర్మ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. 

ఈ సందర్భంగా ఓ నెటిజన్ నేహా శర్మతో.. చిరుత చిత్రంలో మీరు అద్భుతంగా నటించారు. మరోసారి రాంచరణ్ తో కలసి నటిస్తే చూడాలని ఉంది అని కామెంట్ చేశాడు. దీనికి నేహా శర్మ బదులిస్తూ.. నేను కూడా ఎదురుచూస్తున్నా.. చిరుత చిత్రానికి సీక్వెల్ వస్తే బావుంటుంది అని నేహా శర్మ కామెంట్ చేసింది.