ప్రముఖ ఛానెల్ నిర్వహిస్తోన్న రియాలిటీ షోలో మహిళా జడ్జికి కంటెస్టంట్ ముద్దుపెట్టి అందరికీ షాకిచ్చాడు. ఊహించని పరిణామంతో సదరు జడ్జి ఆ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. ఇదంతా సోనీ టీవీ నిర్వహిస్తోన్న 'ఇండియన్ ఐడల్ 11'లో చోటు చేసుకుంది.

అయితే దీనిని సోనీ టీవీ ప్రోమోగా విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  ఇండియన్‌ ఐడల్‌ 11 కార్యక్రమానికి ప్రముఖ గాయకులు అను మాలిక్‌, విశాల్‌ దడ్లానిలతో పాటు నేహా కక్కర్‌ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఓ గాయకుడు పాట పాడిన తరువాత తనను గుర్తుపట్టాల్సిందిగా నేహాను కోరాడు. దాంతో ఆమె స్టేజ్ మీదకు వెళ్లింది. అప్పుడు అతడు తన వెంట తీసుకొచ్చిన కొన్ని బహుమతులను ఆమెకి అందించాడు.

దీంతో ఆమె కృతజ్ఞతగా ఆ వ్యక్తిని కౌగిలించుకాగా.. ఒక్కసారిగా అతడు బలవంతంగా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. దీంతో షాక్ కు గురైన సహ జడ్జీలు, యాంకర్ ఆ వ్యక్తిని అక్కడ నుండి పంపించేశారు. ఈ ఊహించని ఘటనకు కలత చెందిన నేహా అక్కడ నుండి వెళ్లిపోయారు. ఈ ఎపిసోడ్ ఆదివారం నాడు సోనీ ఛానెల్ లో టెలికాస్ట్ కానుంది.