బాలీవుడ్ లో హీరోయిన్ గానే కాకుండా మంచి హోస్ట్ గా కూడా తనకంటూ ఓక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నేహా ధూపియా. గత ఏడాది అమ్మడి పెళ్లి వివాహం ఏ విధంగా వైరల్ అయ్యిందో స్పెషల్ గా చప్పనవసరం లేదు. గత కొంత కాలంగా తన బాయ్ ఫ్రెండ్ అంగద్ బేడీ తో డేటింగ్ లో ఉన్న నేహా స్పీడ్ గా పెళ్లి చేసేసుకుంది.

ఇక ఆమె ఎదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ తో హాట్ టాపిక్ గా నిలుస్తుండడం కామన్ గా మారింది. ఇటీవల అమ్మడు 'నో ఫిల్టర్ విత్ నేహా' షోలో ఒక కంటెస్టెంట్ చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ మండిపడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. నా గర్ల్ ఫ్రెండ్ నాతో ఉంటూనే మరొక నలుగురితో డేటింగ్ చేసిందని అయితే ఆమెను ఒక దెబ్బ కొట్టానని అన్నాడు. దీంతో వెంటనే నేహా అతనిపై ఆగ్రహంతో విరుచుకుపడింది.

ఆమె ఎంతమందితో తిరిగితే నీకేంటి? ఎంతమందితో డేటింగ్ చేస్తే నీకెందుకు? అది ఆమెకున్న స్వేచ్ఛ. ఆమెను కొట్టడానికి నువ్వెవరు. ఏదైనా మా ఇష్టం' అంటూ నేహా అతనిపై బూతులతో విరుచుకుపడింది. ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలను నాలుగు దెబ్బలు కొట్టినందుకు నవ్వేసిన నేహా ఇప్పుడు మోసం చేసిన అబ్బయి ఒక దెబ్బ కొడితే సీరియస్ అవ్వడం కరెక్ట్ కాదని నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.