సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ నయనతార. స్టార్ హీరో సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న ఈ భామ స్టార్ హీరోలకు సమానంగా పేమెంట్ కూడా అందుకుంటుంది. అయితే సినిమాలతో ఏ రేంజ్‌ లో పేరు తెచ్చుకుందో తన లవ్‌ ఎఫైర్స్ కారణంగా అంత కన్నా ఎక్కువగానే వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ. కెరీర్ స్టార్టింగ్ లోనే అప్పటి క్రేజీ హీరో శింబుతో ఓ రేంజ్‌లో ఎఫైర్‌ నడిపింది నయనతార.

అప్పట్లో వీరి ప్రైవేట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తరువాత శింబుకు బ్రేకప్ చెప్పేసిన ఈ బ్యూటీ తరువాత ప్రభుదేవాకు దగ్గరైంది. చాలా సినిమా వేడుకల్లో కలసి కనిపించిన నయన, ప్రభులు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అదే సమయంలో ప్రభుదేవా పేరు తన చేతి మీద పచ్చబొట్టులా వేయించుకుంది. నయనతారను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా ఆయన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. ఇక త్వరలోనే పెళ్లి అనుకుంటున్న తరుణంలో బ్రేకప్‌ చెప్పేసుకున్నారు.

అయితే కలిసున్న సమయంలో నయనతార వేయిచుకున్న పచ్చబొట్టు తరువాత ఆమెకు పెద్ద చిక్కులే తీసుకువచ్చింది. చాలా సందర్భాల్లో నయనతార ఆ టాటూను కవర్ చేసేందుకు చాలా ఇబ్బంది పడింది. అయితే తాజాగా నయనతార ఆ టాటూను రీడిజైన్ చేయించుకుంది. ప్రభు అనే పేరును పాజిటివిటీగా మార్చుకుంది నయన్. ప్రభుదేవాతో బ్రేకప్ తరువాత కొంతకాలం పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెట్టిన నయన్, ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.