దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతారకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ లో సినిమాకి మూడు నుండి నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఆమె. అయితే నయన్ ఎన్ని సినిమాల్లో నటించినా.. ప్రమోషన్స్ లో మాత్రం ఎక్కడా కనిపించదు. ఇక ఇంటర్వ్యూల సంగతి సరే సరి. అలాంటిది ఈ బ్యూటీ ప్రాముఖ్య మ్యాగజైన్ 'వోగ్ ఇండియా'కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ పదేళ్లలో ఆమె ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూఇది. ఇందులోనైనా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటుందని అభిమానులు ఆశించారు కానీ అది జరగలేదు. వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది నయన్. షూటింగ్స్ తో చాలా బిజీగా ఉంటానని.. తనకు పనిపట్ల అంకితభావం ఎక్కువ అని.. ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోనని చెప్పింది.

సినిమాల్లో విజయం సాధించి పెద్ద హీరోయిన్ అయినంత మాత్రాన వేరేవాళ్లలాగా తనకు గర్వం రాలేదని చెప్పింది. నిజానికి తనలో భయం మరింత పెరిగిందని.. ఏ పాత్రలో తను సరిగ్గా నటించలేనోననే భయంతో జీవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. చాలా కాలంగా నయన్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనే నటిస్తోంది. దీనిపై కామెంట్ చేసిన ఆమె అలాంటి సినిమాల్లో ప్రతీ విషయాన్ని తనే దగ్గరుండి చూసుకుంటానని చెప్పింది.

ఈ పదేళ్లలో ఇది తన మొదటి ఇంటర్వ్యూ అని.. తనేం ఆలోచిస్తుందో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదని.. వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం తనకు ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది. రీసెంట్ గా నయనతార నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె 'దర్బార్' అనే సినిమాలో నటిస్తోంది.