కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కబలిస్తున్న వేళ ప్రజలంతా ఒక్కటిగా ఆ వైరస్‌తో పోరాడేందుకు ముందుకు వస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటిగా ఈ ప్రాణాంతక సమస్యపై యుద్ధ చేస్తుంటే పలువురు సెలబ్రిటీలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. తమ వంతుగా ఆర్థిక సాయం చేస్తూ ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనాపై పోరాటం నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా లేడీ సూపర్‌ స్టార్ నయనతార కూడా తన వంతు సాయం అంధించేందుకు ముందుకు వచ్చింది. కరోనా వల్ల పని కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న సినీ కార్మికుల కోసం సాయం ప్రకటించింది. కార్మికులకు అండగా ఫిలిం ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్ సౌత్‌ ఇండియాకు 20 లక్షల విరాళాన్ని ప్రకటించింది.

ఇటీవల సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతార గ్లామర్ రోల్స్ చేస్తునే లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం సౌత్ టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ భామ కొంత కాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో డేటింగ్ లో ఉంది. త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.