స్టార్ హీరోల చిత్రాల కోసం ప్రస్తుతం నయనతార ఫస్ట్ ఛాయిస్ గా మారింది. వరుసగా క్రేజీ చిత్రాల్లో నటిస్తూ నయన్ దూసుకుపోతోంది. హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు.. లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో సైతం నయన్ రాణిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రాలు స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతున్నాయి. 

నయనతార మీడియాకు దూరంగా ఉండే నటి. కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి తరచుగా ఏదో రకమైన వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నయన్ ప్రేమ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్. ప్రస్తుతం నయనతార తమిళ యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. 

చెట్టాపట్టాలేసుకుని విదేశాల్లో వీరిద్దరూ విహరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నయన్ వయసు 34 ఏళ్ళు. ఆల్రెడీ ఇప్పటికే నయనతార సౌత్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించేసింది. దీనితో త్వరలో నయన్ వివాహం చేసుకోవాలని డిసైడ్ అయినట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. 

సెలెబ్రిటీల జీవితం గురించి తరచుగా మాట్లాడే ఓ ప్రముఖ జ్యోతిష్యుడు కూడా నయనతార వివాహం ఈ ఏడాది డిసెంబర్ లో జరుగుతుందని చెప్పాడు. నయనతార ఇటీవల విగ్నేష్ శివన్ తో కలసి కొన్ని ఆలయాల్లో పూజలు చేయడంతో నయన్ పెళ్లి గురించి వార్తలు ఎక్కువయ్యాయి. నయన్, విగ్నేష్ తమ రిలేషన్ షిప్ ని నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని వారి సన్నిహితులు అభిప్రాయ పడ్డారు. 

విజయ్ బిగిల్, రజనీ దర్బార్ చిత్రాలు పూర్తయ్యాక పెళ్లి నయన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా టాక్ నడిచింది. కానీ రీసెంట్ గా నయనతార మరికొన్ని ఆసక్తికర చిత్రాలకు ఒకే చెప్పింది. ఆర్ జె బాలాజీ దర్శత్వంలో నయన్ ఓ చిత్రం చేయబోతోంది. అదే విధంగా విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్న నెట్రికన్ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నయన్ నటిస్తోంది. ఇలా వీరిద్దరూ సినిమాలతో బిజీ అయిపోవడంతో నయన్ వివాహం ఏఈ ఏడాది కూడా జరగదని, నయన్ పెళ్లి మరోమారు వాయిదా పడ్డట్లే అని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. 

కెరీర్ ఆరంభంలో నయనతార స్టార్ హీరో శింబుతో ప్రేమాయణం సాగించింది. అతడి నుంచి విడిపోయాక ప్రభుదేవా ప్రేమలో పడింది. వీరిద్దరి రిలేషన్ కూడా బ్రేకప్ అయింది.