నయనతార ప్రస్తుతం సౌత్ లో బడా చిత్రాల్లో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన నయన్ నటించిన సైరా చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. నయనతార ప్రస్తుతం బిగిల్, దర్బార్ లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. నయనతార మీడియా ముందుకు అస్సలు రాదు. ఈవెంట్స్ కి కూడా హాజరు కాదు. 

తన వ్యక్తిగత విషయాలని బయట చర్చించేందుకు ఇష్టపడదు. పేరుమోసిన హీరోయిన్లంతా ఫోటో షూట్స్ చేస్తూ కాసులు వెనకేసుకుంటున్నారు. కానీ నయనతార మాత్రం అలాంటి ఫోటో షూట్స్ కు చాలా రోజులుగా దూరంగా ఉంటోంది. ఏమైందో ఏమో కానీ నయన్ తాజాగా తన రూల్స్ బ్రేక్ చేసింది. 

వోగ్ ఇండియా కవర్ పేజీ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నయన్ గ్లామర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

మరో విశేషం ఏంటంటే సౌత్ సూపర్ స్టార్స్ అయిన మహేష్, దుల్కర్ సల్మాన్ ఉన్న కవర్ పేజీపై నయనతార ఫోటో కూడా ఉంది. ఈ దృశ్యం కూడా అభిమానులని ఆకట్టుకుంటోంది. 

నయనతార సడెన్ గా ఇలా ఫోటో షూట్ చేసే సరికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే సైరా లాంటి బడా చిత్రంలో నటించినప్పటికీ నయన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. నయనతార స్ట్రిక్ట్ రూల్స్ లో ఇది కూడా ఒకటి.