దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ విజువల్ వండర్‌ ఆర్ఆర్ఆర్. మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 8న రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతుండటంతో స్టార్ కాస్ట్ విషయంలోనూ అదే స్థాయి భారీ తనం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమిళ విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఓ టాలీవుడ్‌ యంగ్ హీరో కూడా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై హీరో నవదీప్‌ స్పందించాడు.

ఇటీవల నవదీప్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఈ చర్చకు దారి తీసింది. రెట్రో లుక్‌లో ఉన్న నవదీప్‌ స్టిల్‌ ను చూసిన అభిమానులు నవదీప్‌ కూడా ఆర్ఆర్‌ఆర్‌లో నటిస్తున్నాడని పొరపడ్డారు. అవే వార్తలు మీడియాలో కూడా రావటంతో నవదీప్‌ స్పందించాడు. తాను ఆర్ ఆర్ఆర్‌లో నటించటం లేదని క్లారిటీ ఇచ్చాడు నవదీప్. కేవలం క్వారెంటైన్‌లో భాగంగా ఖాళీగా ఉన్న తాను కొత్త లుక్‌ ట్రై చేశానని క్లారిటీ ఇచ్చాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Quarantinekathalu

A post shared by Nav Deep (@pnavdeep) on Apr 11, 2020 at 11:09pm PDT