మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన చిరు, తన చిన్న చిన్న ఎక్స్‌పీరియన్స్‌లను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. అదే సమయంలో చిరు ట్వీట్‌లకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు అంతే స్థాయిలో రెస్పాన్డ్ అవుతున్నారు.

తాజాగా మంగళవారం ఉదయం ఓ ఆసక్తికర వీడియోను తన ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్ చేశాడు చిరు. తన మనవరాలు నవిష్క (శ్రీజ, కళ్యాణ్ దేవ్‌ల కూతురు)తో కలిసి సరదాగా టీవీ చూస్తుండగా నవిష్క, ఖైదీ నంబర్‌ 150 సినిమాలోని మిమ్మీ పాట కావాలని మారం చేస్తోంది. మనవరాలి ముద్దు ముద్దు మాటలకు మురిసిపోతున్న చిరు ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు సంగీతం సంవత్సరం వయసున్న చిన్నారిని కూడా ఎంతగా ఆకట్టుకుంటుంది. అంటూ కామెంట్ చేశాడు.

అయితే ట్వీట్‌పై యంగ్ హీరో నాని  చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. వీడియోలో నాకు ఇద్దరు చిన్నారులు కనిపిస్తున్నారు మీరు ఏ చిన్నారి గురించి మాట్లాడుతున్నారు సర్‌ అంటూ చిరు కూడా ఓ చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాడని చెప్పకనే చెప్పాడు నాని. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కాజల్‌ అగర్వాల్‌, సాయి ధరమ్ తేజ్‌లు కూడా  ఈ వీడియోపై తమదైన స్టైల్‌లో స్పందించారు.