ఇటీవల కాలంలో కొంత మంది మీడియం రేంజ్ హీరోల స్పీడ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ముఖ్యంగా నాని. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఏడాది మొత్తం బిజీ బిజీ షెడ్యూల్స్ తో రెస్ట్ లేకుండా కష్టపడనున్నాడు. 2020లో కూడా గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేయబోతున్నాడు.

ఇప్పటికే మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'V' సినిమా షూటింగ్ పూర్తి చేసిన న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ నిన్ను కోరి ఫెమ్ శివ నిర్వాణ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు. 'టక్ జగదీష్' అని టైటిల్ తోనే సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ ని కలిగించిన నాని ఆ సినిమాలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ లో ఎక్కువగా కనిపించబోతున్నాడట. ఇక టాక్సీ వాలా దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ కి కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ మూడు ప్రాజెక్టులతో పాటు మరొక యువ దర్శకుడు చెప్పిన కథకు ఒకే చెప్పినట్లు సమాచారం. మెంటల్ మదిలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన ఒక సాలిడ్ కథను న్యాచురల్ స్టార్ కి వినిపించినట్లు సమాచారం. నానికి కాన్సెప్ట్ నచ్చినప్పటికీ కొంత చేంజెస్ అవసరమని సలహా ఇచ్చాడట. ఈ విధంగా నాని ఈ ఏడాది నాలుగు కథలను సెట్స్ పైకి తెచ్చినట్లు అవుతుంది. మరి ఆ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.