నేచరల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా నటించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధం కావడంతో యూనిట్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు నాని కూడా సిద్ధమయ్యారు.  

టాలీవుడ్ స్టార్ హీరో.. నేచురల్ స్టార్ నాని (Nani) చివరిగా శ్యామ్ సింగరాయ్ చిత్రంతో బిగ్ సక్సెస్ ను అందుకున్నాడు. అదే జోష్ లో వరుస చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా నాని, నజ్రియా ఫహద్ జంటగా నటించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అంటే సుందరానికీ’ Ante Sudaraniki. ఈ చిత్ర షూటింగ్ గతేడాది ఏప్రిల్ లో ప్రారంభమై.. ఈ ఏడాది జనవరి 23న పూర్తి అయ్యింది. తక్కువ సమయంలోనే సినిమాను మంచి అవుట్ పుట్ తో ముగించినట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ నుంచి టాక్ వినిపిస్తోంది. 

కాగా, ఈ మూవీ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. జూన్ 10న గ్రాండ్ థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రంపై ఆసక్తిని పెంచేందుకు మేకర్స్ వరుస అప్డేట్స్ అందిస్తున్నారు. రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్సాన్స్ వస్తోంది. నిన్న ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే మూవీ రిలీజ్ కు మరికొద్దిరోజులే సమయం ఉండటంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. ఈరోజు నుంచి చిత్ర ప్రచార కార్యక్రమాలపై యూనిట్ అడుగులు వేయనుంది.

నాని కూడా ‘అంటే సుందరానికీ’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ‘లెట్ ద షో బిగిన్’ అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఈ సినిమా కోసం నాని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘దసరా’కు కాస్తా బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మళ్లీ ఈ చిత్రం రిలీజ్ తర్వాత షూటింగ్ పాల్గొననున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఈ మూవీపై పెద్దగా హైప్ లేకపోవడంతో మిగిలిన ఈ కాస్తా సమయంలో ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించానుకుంటున్నారు.

ఈ మూవీలో నాని సుందర ప్రసాద్ పాత్రను పోషించగా.. హీరోయిన్ నజ్రియా ఫహద్ లీలాగా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ సాగర్ మంచి సంగీతం అందిస్తున్నారు. నాని నటిస్తున్న ‘దసరా’చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటిస్తోంది.

View post on Instagram