Asianet News TeluguAsianet News Telugu

అ! సీక్వెల్.. నాని ఎందుకు పట్టించుకోవట్లేదు?

నిర్మాతగా మొదటి అడుగు వేసిన న్యాచురల్ స్టార్ నాని నిర్మాత కష్టాలను తొందరగానే తెలుసుకున్నాడు. అందుకే మరో సినిమాను నిర్మించడానికి మెల్లగా అడుగులు వేస్తున్నాడు. హిట్ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. 

natural star Nani backs out of Awe sequel
Author
Hyderabad, First Published Feb 13, 2020, 11:31 AM IST

అ! సినిమాతో నిర్మాతగా మొదటి అడుగు వేసిన న్యాచురల్ స్టార్ నాని నిర్మాత కష్టాలను తొందరగానే తెలుసుకున్నాడు. అందుకే మరో సినిమాను నిర్మించడానికి మెల్లగా అడుగులు వేస్తున్నాడు. హిట్ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నాని అ! సినిమాకు సీక్వెల్ ని కూడా చేయబోతున్నట్లు టాక్ వచ్చింది.  ఇక ఇప్పుడు అలాంటిదేమి లేదనే విధంగా మరొక టాక్ కూడా వస్తోంది.

అ! చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసినదాని బట్టి ఒక క్లారిటీ అయితే వచ్చింది. సినిమా స్క్రిప్ట్ ఏడాది క్రితమే రెడీ చేసి ఉంచిన ప్రశాంత్ సరైన నిర్మాత కోసం ఎదురుచూస్తున్నాడట. అలాగే నాని కూడా కలవలేదని చెప్పాడు. ఇక నాని సినిమా చేయట్లేదని క్లారిటీ అయితే వచ్చింది. మొదట అ! కథ విన్నప్పుడు తానే సొంతంగా నిర్మిస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాడు.  

అయితే అ! సినిమా మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి సినిమాకు ఎలాంటి లాభం చేకూరలేదు. కాన్సెప్ట్ బావున్నా సినిమా మేకింగ్ ఊహించినంతగా రాలేదని అనుకున్నాడట. అ! కథను అంతగా మెచ్చిన నాని సీక్వెల్ పై ఎందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదనేది దర్శకుడికే తెలియాలి.

నాని సీక్వెల్ పై కూడా ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపలేదని అర్ధమవుతోంది. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనుకునే నిర్మాతలు కూడా అ! సీక్వెల్ పై ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక దర్శకుడు రాజశేఖర్ తో చేసిన కల్కి సినిమా కూడా మరో డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ సినిమా నిర్మించడానికి ఎవరు ముందుకు రావడం లేదని కథనాలు వెలువడుతున్నాయి. అ! నిజంగా సక్సెస్ అయ్యి ఉంటే నిర్మాతలే అతని వెంట పడుతుండే వారు. వేదం సినిమా డిజాస్టర్ అయినప్పటికీ క్రిష్ కి ఇతర నిర్మాతల నుంచి మంచి ఆఫర్స్ దక్కాయి. ఎన్టీఆర్ బయోపిక్ దెబ్బ కొట్టినా కూడా.. పవన్ తో ఛాన్స్ కొట్టేశాడు. ఈ విధంగా ఆలోచిస్తే.. అ! సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios