Asianet News TeluguAsianet News Telugu

మరోసారి రెమ్యూనరేషన్ పెంచిన బాలయ్య.. బాబీ సినిమాకు ఎంత తీసకుంటున్నాడంటే..?

మరోసారి రెమ్యూనరేషన్ ను భారీ గా పెంచాడట నటసింహం నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాకు భారీగా పారితోషికం తీసుకోబోతున్నట్టుతెలుస్తోంది. 

Natasimham Balakrishna Increase Her Remuneration Boby Movie JMS
Author
First Published Oct 31, 2023, 3:08 PM IST | Last Updated Oct 31, 2023, 3:08 PM IST

మరోసారి రెమ్యూనరేషన్ ను భారీ గా పెంచాడట నటసింహం నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాకు భారీగా పారితోషికం తీసుకోబోతున్నట్టుతెలుస్తోంది. 

కుర్రహీరోలను మించి దూసుకుపోతున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. వరుస సినిమాలు.. వరుస హిట్లతో యంగ్ హీరోలకు కూడా షాక్ ఇస్తున్నాడు. అందులోనూ.. ఆయన సినిమాలు పెద్ద పెద్ద బడ్జెట్ లు ఉండవు.. కాని ఈ మధ్య ఆయన చేసిన సినిమాలన్నీ 100 కోట్లు దాటి కలెక్ట్ చేస్తున్నాయి. దాంతో ఆయనతో పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారట పెద్ద పెద్ద దర్శకులు. ఈక్రమంలో బాలయ్య బాబు.. రెమ్యూనరేషన్ కూడా పెంచినట్టు తెలుస్తోంది. 

వీరసింహారెడ్డి కూడా విడుదలై విజయం సాధించడంతో, నిర్మాతలు "భగవంత్ కేసరి" కోసం బాలకృష్ణకు 18 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ ఇంచ్చారట. ఇక ఈసినిమా కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడం.. 100 కోట్లు దాటి కలెక్షన్స్ పరుగులు పెట్టడంతో..బాలయ్య తన నెక్ట్స్ సినిమాకు 28 కోట్లు వసూలు చేస్తున్నాడని టాక్. బాబీ దర్శకత్వంలో, నాగవంశీ నిర్మించబోయే చిత్రానికి తన కెరీర్ లోనే హయ్యస్ట్ ఎమౌంట్ ను బాలయ్య అందుకోబోతున్నారు. బాలకృష్ణ సినిమాలు టోటల్ బిజినెస్  అంటే.. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ తో పాటు ఇతర వసూళ్లతో కలిపి దాదాపు 150 కోట్లు ఆర్జిస్తున్నాయి. 

అయితే  100 కోట్ల బిజినెస్ ఉన్నహీరోలు.. 30 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటుంటే..  ఇంత ఫాలోయింగ్ ఉన్న బాలయ్య 28 కోట్లు తీసుకోవడంలో తప్పులేదు అంటున్నారు సినిమా పండితులు. అంతే కాదు.. ఈ విషయంలో నిర్మాతలకు భారం కూడా పడదంటున్నారు.  సీనియర్ స్టార్లలో, చిరంజీవి 50 కోట్లు, రవితేజ 24 కోట్లు, నాగార్జున, వెంకటేష్ 12 నుంచి 15 కోట్లు.. తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ 28 కోట్లు తీసుకోవడం నిజం అయితే.. చిరు తరువాత టాలీవుడ్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచారనిచెప్పొచ్చు. 
.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios