కొంత మంది సినీ తారల జీవితాలు సినిమా కథకు ఏ మాత్రం తీసిపోవు. అలాంటి అరుదైన ఓ జీవితమే సంజయ్‌ దత్‌ ది. ఆయన జీవితంలో ఓ కమర్షియల్ సినిమాకు కాల్సిన అన్ని రకాల మసాలాలు ఉన్నాయి. అందుకే సంజయ్ దత్‌ బయోపిక్‌ను సంజూ పేరుతో సినిమాగా తెరకెక్కించాడు రాజ్‌ కుమార్‌ హిరానీ. అయితే తాజాగా సంజయ్‌ దత్‌ జీవితంపై ఓ బయోగ్రాఫీ పుస్తకం రిలీజం అయ్యింది.

యాసర్‌ ఉస్మాన్‌ అనే రచయిత సంజయ్‌ దత్‌ బయోగ్రఫీని రాశాడు. సంజయ్ దత్‌ : ద క్రేజీ అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్‌ బాలీవుడ్స్‌ బ్యాడ్‌ బ్యాయ్‌ పేరుతో రాసిన ఈ పుస్తకంలో సంజూ బాబా జీవితంలోనే ఎన్నో విషయాలను వివరించాడు. ఆయన జీవితంలో ఎదురైన ఇబ్బంది కర సంఘటనల, తల్లి నర్గీస్ దత్‌తో ఆయన రిలేషన్‌ గురించి వివరించాడు. అంతేకాదు సంజయ్‌ ఎలా డ్రగ్స్‌కు బానిస అయ్యాడో కూడా వివరించాడు. 

ఈ విషయంలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు యాసర్‌. సంజయ్ డ్రగ్ ఎడిక్ట్ అయిన విషయం తల్లి నర్గీస్‌ దగ్గర ప్రస్థావించినా ఆమె నమ్మలేదట. అంతేకాదు నమ్మకపోగా తన కొడుకు గే ఎమో అన్న అనుమానం వ్యక్తం చేసిందట ఆమె. నర్గీస్ దత్‌ తన పిల్లలను ఎంతో గారభం చేసేదని, ముఖ్యంగా పెద్ద కొడుకు కాబట్టి సంజయ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టమని వెల్లడించాడు. ఆ గారాబం కారణంగానే డ్రగ్ ఎడిక్ట్ అయిన సంజయ్‌లో వస్తున్న వ్యవహారశైలిలో మార్పులను ఆమె గుర్తించలేకపోయిందని తెలిపాడు.