డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో నారా రోహిత్. అపజయాలు ఎన్ని వస్తున్నా తనకు నచ్చిన ఫార్మాట్ లోనే కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఎలాగైనా మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని గత కొంత కాలంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం రోహిత్  రెండు డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు సెట్స్ పైకి వచ్చి చాలా కాలమవుతోంది. కానీ ఎప్పుడు రిలీజ్ కానున్నాయి అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ఇక ప్రాజెక్ట్స్ ని పక్కనపెట్టిన రోహిత్ మారో సినిమాను మొదలుపెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

 

రీసెంట్ గా శ్రీ విష్ణు తిప్పరా మీసం ప్రమోషన్స్ లో పాల్గొన్న రోహిత్ నెక్స్ట్ ఈ సినిమా దర్శకుడితోనే మరో సినిమా చేయనున్నట్లు చెప్పాడు. తిప్పరా మీసం సినిమాను తెరకెక్కించిన కృష్ణ విజయ్ తో రోహిత్ గతంలో అసురా అనే సినిమా చేశాడు. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ నటుడిగా రోహిత్ కి మంచి గుర్తింపు తెచ్చింది.

ఇక మరోసారి అదే దర్శకుడితో మరో ప్రయోగానికి సిద్దమైన నారావారబ్బాయి ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఇక తిప్పరా మీసం సినిమా ఈ నెల 8న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. . ఇక చైతన్య దంతులూరి దర్శకుడితో చేస్తున్న అనగనగా దక్షిణాదిలో అనే ఆ సినిమా విషయానికి వస్తే.. మరికొన్ని వారాల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఒక పీరియడ్ డ్రామా తరహాలో వీరి సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సరికొత్త గెటప్ లో రోహిత్ కనిపిస్తాడట. ప్రతి సినిమాలో రోహిత్ ఒకేలా కనిపిస్తున్నాడని వస్తున్న కామెంట్స్ కు ఈ సినిమా ద్వారా సమాధానం చెప్పనున్నాడట. సినిమా మొత్తం 1970 బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని సమాచారం.

ఇప్పటికే సినిమా సెట్స్ కి సంబందించిన ప్లాన్స్ కూడా ఫినిష్ అయినట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి షూటింగ్ ను స్టార్ట్ చేయాలనీ నారా రోహిత్ ప్లాన్ వేస్తున్నాడు. ముందుగా జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేయాలనీ అనుకున్నారు. ఇక ఇప్పుడు డిసెంబర్ లోనే మొదలెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.