న్యాచురల్ స్టార్ నాని కెరీర్ మొదటి నుంచి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఏడాది మొత్తం బిజీ బిజీ షెడ్యూల్స్ తో రెస్ట్ లేకుండా కష్టపడనున్నాడు. 2020లో కూడా గ్యాప్ తీసుకోకుండా  వరుసగా సినిమాలు చేయబోతున్నాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'V' సినిమా షూటింగ్ పూర్తి చేసిన నాని ఆ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయాలనీ అనుకున్నాడు.

కానీ కరోనా వైరస్ కారణంగా నాని కూడా వెనకడుగు వేయకతప్పలేదు. వరల్డ్ వైడ్ గా జనాలను ఇబ్బంది పెడుతున్న కరోనా సినిమాల రిలీజ్ పై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోంది. హాలీవుడ్ సినిమాలు సైతం రిస్క్ చేయకూడదని ఏడాదిపాటు రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు నాని 'V' సినిమా కూడా వాయిదా పడింది. ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేసేది ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

దిల్ రాజు యూనిట్ ఈ విషయాన్నీ అధికారికంగా తెలియజేసింది. నాని ఈ సినిమాలో నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరొక హీరో సుధీర్ బాబు సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇటీవల రిలీజ్ అయినా సాంగ్ అండ్ టీజర్ కి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తరువాత నాని నెక్స్ట్ నిన్ను కోరి ఫెమ్ శివ నిర్వాణ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు.