నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ నే బ్యానర్ స్థాపించి 'అ!' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కానప్పటికీ నేషనల్ అవార్డ్స్ దక్కించుకుంది.

ఈ సినిమా స్ఫూర్తితో నాని మరో సినిమాని నిర్మించాడు. అదే 'హిట్' సినిమా. 'ది ఫస్ట్ కేస్' అనేది ట్యాగ్ లైన్.  'ఫలక్ నుమా దాస్' సినిమాతో పాపులర్ అయిన కుర్ర హీరో విశ్వక్ సేన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో విశ్వక్ సేన్ రుద్రరాజు అనే పాత్రలో కనిపించనున్నారు.

పవన్, ప్రభాస్ కు అవసరం.. వాళ్లకు తప్పనిసరి.. మిస్సైతే అంతే సంగతులు!

ఈ సినిమాతో శైలేష్‌ అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇటీవల్ విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ జనాలను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. టీజర్ ని బట్టి ఈ సినిమా ఓ మిస్సింగ్ కేసు చుట్టూ సాగే కథ అని తెలుస్తోంది.

కథ ప్రకారం.. పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఆ మిస్సింగ్ కేసుని చేధించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులను థ్రిల్లింగ్ గా చూపించబోతున్నారు. టీజర్ ని మాత్రం బాగానే కట్ చేశారు.

సినిమాపై అంచనాలు పెరిగే విధంగా టీజర్ ఉంది.  ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జంటగా.. 'చిలసౌ' ఫేం రుహానీ శర్మ నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.