నాని స్పీడు పెంచాడు. కథ నచ్చిన వెంటనే లేటు చేయకుండా ప్రాజెక్టు ఓకే చేసి ముందుకు దూకేస్తున్నాడు. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా షూటింగ్ లో ఉన్న నాని రీసెంట్ గా టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తో ప్రాజెక్టు ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.
 
ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పై త్వరలో అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నాని ఇప్పటి వరకు చేసిన సినిమాలకి భిన్నంగా యంగ్ టాలెంటెడ్ దర్శకులతో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ముందుకి వెళ్తూండటంతో అంతటా హాట్ టాపిక్ గా మారారు. తాజాగా హిట్ సినిమాతోనూ అభిరుచి ఉన్న నిర్మాతగా ముద్ర వేయించుకున్నారు.
 
ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ తరువాత “టాక్సీ వాలా ” ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో నాని హీరోగా “శ్యామ్ సింగరాయ్” మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమా షూట్ లో ఉండగానే వివేక్ ఆత్రేయ సినిమా పట్టాలు ఎక్కతుంది.