Asianet News TeluguAsianet News Telugu

‘దసరా’టైటిల్ తో నాని నెక్ట్స్ మూవీ, డిటేల్స్

కథ, కథనం బాగా పట్టున్న కొత్త దర్శకులతో సినిమాలు చేయడం నయం అనుకుంటున్నాడు నాని. అందుకే క్రేజీ దర్శకులను కాకుండా ఒకట్రెండు సినిమాల అనుభవం ఉన్న వాళ్లతోనే ఎక్కువగా చేస్తున్నాడు.

Nani next movie titled Dasara
Author
Hyderabad, First Published Sep 16, 2021, 2:30 PM IST


ఆ మధ్యన నాని వరస సినిమాలు చేసుకుంటూపోయేవాడు. ఆయనపై పెట్టుబడి పెట్టిన నిర్మాతలు కూడా ఫుల్ ఖుషీగా ఉండే వారు. అయితే ఈ మధ్యన వరస ఫ్లాపులు వచ్చేసరికి   కాస్త జోరు తగ్గించాడు.  కథల విషయంలో మరింత కాన్సట్రేట్ చేస్తున్నాడు.  స్టార్ డైరెక్టర్స్‌ను నమ్ముకునే కంటే కూడా కథ, కథనం బాగా పట్టున్న కొత్త డైరక్టర్స్  వైపే మ్రొగ్గు చూపుతున్నాడు. ఈ క్రమంలో నాని కొత్తగా మరో సినిమా ఓకే చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని నానీనే స్వయంగా మీడియాకు రివీల్ చేసారు.  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి ‘దసరా’ అనే టైటిల్ అనుకుంటున్నారట.

రీసెంట్ మీడియాతో మాట్లాడిన నాని.. తన తదుపరి సినిమా గురించి వెల్లడించారు. దసరా నాటికి తన కొత్త సినిమా అనౌన్స్ చేస్తానని అన్నారు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. సుధాకర్ చెరుకూరి సినిమాను నిర్మించబోతున్నారు. దసరా టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారని టాక్. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథగా సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాలో నాని కొత్త లుక్ తో కనిపించబోతున్నారు. దసరా రోజు టైటిల్ పోస్టర్ తో పాటు నాని లుక్ ను కూడా రివీల్ చేస్తారట. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ ను లాక్ చేశారు. అలానే నటీనటులను, టెక్నీషియన్స్ ను ఫైనల్ చేసుకున్నారు. వచ్చే సంవత్సరం సెకండ్ హాఫ్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం అంటే సుంద‌రానికి సినిమాతో బిజీగా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా… త‌ను ఇప్ప‌టికే న‌టించిన శ్యామ్ సింగా రాయ్ విడుద‌ల‌కు రెడీగా ఉంది. థియేట‌ర్ల‌లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని నాని ఫిక్స్ అయ్యాడు.  త్వరలో శ్యామ్ సింగ రాయ్ విడుదలయ్యేలా కనిపిస్తుంది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంక్రీత్యన్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

 ఇక ‘టక్ జగదీష్’విషయానికి వస్తే... ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల దాదాపు అందరూ హ్యాపీగా  ఉన్నారని చెప్పాలి. ఈ సినిమాను లాభమొచ్చే  రేటుకు అమ్ముకుని నిర్మాతలు ఒడ్డున పడ్డారు. ఈ చిత్రాన్ని కొన్న అమేజాన్ ప్రైమ్ కూడా వచ్చిన  రెస్పాన్స్ తో సంతోషంగా ఉంది. వాళ్లు పెట్టిన రేటు గిట్టుబాటు అయినట్లే అంటున్నారు. అదే ఈ చిత్రం థియేటర్లలో రిలీజై ఉంటే మాత్రం కచ్చితంగా బయ్యర్లకు దెబ్బపడేది.
 

Follow Us:
Download App:
  • android
  • ios