టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ V. చాలా వరకు నాని ఇటీవల కాలంలో కాస్త డిఫరెంట్ గానే అడుగులు వేస్తున్నాడు. జెర్సీ సినిమాతో స్పోర్ట్స్ డ్రామాని టచ్ చేసిన న్యాచురల్ స్టార్ ఆ తరువాత చేసిన గ్యాంగ్ లీడర్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఇక నాని నుంచి ఆడియెన్స్ ఒక యాక్షన్ మూవీ రావాలని కోరుకున్నారు.

వైలెన్స్ గట్టిగా ఉండేలా మంచి థ్రిల్లర్ మూవీ చేస్తే బావుండు అని అనుకున్నారు. ఇక వారి ఊహలకు తగ్గట్టుగానే వి సినిమాతో సిద్దమవుతున్నట్లు నాని ఒక క్లారిటీ ఇచ్చేశాడు. సినిమాకు సంబందించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేసిన నాని గన్స్ పట్టుకొని వైలెన్స్ గట్టిగా ఉండబోతోందని చెబుతున్నాడు. వైలెన్స్ కావాలన్నారు గా ఇస్తా.. ఉగాదికి సాలిడ్ గా ఇస్తా.. అని నాని కామెంట్ చేశాడు.

ఇక అందరూ అనుకున్నట్టుగానే సినిమా రిలీజ్ 2020 మార్చ్ 25న రిలీజ్ కాబోతోంది. అఫీషియల్ గా పోస్టర్ లో ఒక క్లారిటీ ఇచ్చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. నాని కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిననున్నట్లు టాక్ వస్తోంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నాడు.

నాని - సుధీర్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకమని తెలుస్తోంది.  ప్రస్తుతం సగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా మిగతా వర్క్ ని కూడా ఫినిష్ చేయాలనీ కష్టపడుతున్నారు. 

ఇక సినిమాకు సంబందించిన స్పెషల్ టీజర్ ఫై కూడా మరికొన్ని రోజుల్లో క్లారిటీరానుంది. నివేత థామస్ - అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు. ఈ సంగీత దర్శకుడు ఇంతకుముందు సైరా సినిమాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నాని ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.