నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నాని V అనే చిత్రంలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శత్వంలో, టక్ జగదీశ్ అనే చిత్రంలో శివ నిర్వాణ దర్శత్వంలో నటిస్తున్నాడు. ఈ ఏడాది నాని నుంచి మరో మూవీ కూడా రాబోతోంది. 

సోమవారం రోజు నాని బర్త్ డే సంధర్భంగా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అదిరిపోయే ప్రకటన చేసింది. నాని 27వ చిత్ర టైటిల్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంస్కృత్యాన్ దర్శత్వం వహించనున్నాడు. ఇంతకీ ఈ చిత్ర టైటిల్ ఏంటంటే.. 'శ్యామ్ సింగ రాయ్'. వినగానే ఆసక్తి పెంచేలా ఉన్న ఈ టైటిల్ ని ఓ వీడియో రూపంలో ప్రకటించారు. 

ఆ వీడియోలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయే విధంగా ఉంది. నాని కళ్ళని మంత్రమే రివీల్ చేస్తున్న ఈ టైటిల్ కేక పెట్టించే విధంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. 

టాక్సీవాలా చిత్రంలో విభిన్నమైన కాన్సెప్ట్ తో మెప్పించిన దర్శకుడు రాహుల్.. ఈ చిత్రంలో కూడా నానితో భారీ ప్రయోగమే చేయించబోతున్నట్లు అర్థం అవుతోంది. మంచి పాత్ర దొరికితే జీవించేసే నాని ఈ చిత్రంలో ఎలా నటించబోతున్నాడో ఊహించుకోవచ్చు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. టైటిల్ వీడియోపై ఓ లుక్కేయండి..