Asianet News TeluguAsianet News Telugu

నాని ' MCA' రీమేక్ ట్రైలర్ చూశారా?

 హీరోపంటి, బాగి చిత్రాల ద‌ర్శ‌కుడు స‌బ్బీర్ ఖాన్ ఎంసీఏను రీమేక్ చేశాడు. ఆ సినిమా పేరు.. నిక‌మ్మ‌. ఒరిజిన‌ల్ లో  భూమిక చేసిన వ‌దిన పాత్ర‌ను హిందీలో శిల్పా శెట్టి చేసింది. సాయిప‌ల్ల‌వి పాత్ర‌లో కృష్ణ వ్రింద విహారి హీరోయిన్ షెర్లీ న‌టించింది.  తాజాగా ట్రైల‌ర్ లాంచ్ చేశారు. 

Nani MCA hindi remake trailer released
Author
Mumbai, First Published May 18, 2022, 12:10 PM IST


 వరసగా ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ సినిమాలు రెండు హిందీ భాక్సాఫీస్ ని భయపెట్టాయి. అక్కడ హీరోలకు సరైన కథలు దొరకటం లేదా అన్న రీతిలో సినిమాలు రెడీ అవుతున్నాయి. దాంతో వరస పెట్టి రీమేక్ లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ యావరేజ్ అనిపించుకున్న సినిమా రైట్స్ సైతం తీసేసుకుంటున్నారు. ఆ క్రమంలో  నాని కెరీర్ లో  యావరేజ్ గా నడిచిన ఎమ్ సీఏ సినిమా ఇప్పుడు హిందీలోకి రీమేక్ అయ్యింది.  

ఈ సినిమా ద్వారా అభిమ‌న్యు అనే కొత్త న‌టుణ్ని పరిచయం చేస్తున్నారు.  హీరోపంటి, బాగి చిత్రాల ద‌ర్శ‌కుడు స‌బ్బీర్ ఖాన్ ఎంసీఏను రీమేక్ చేశాడు. ఆ సినిమా పేరు.. నిక‌మ్మ‌. ఒరిజిన‌ల్ లో  భూమిక చేసిన వ‌దిన పాత్ర‌ను హిందీలో శిల్పా శెట్టి చేసింది. సాయిప‌ల్ల‌వి పాత్ర‌లో కృష్ణ వ్రింద విహారి హీరోయిన్ షెర్లీ న‌టించింది.  తాజాగా ట్రైల‌ర్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ మీరూ చూడండి.

అయితే ట్రైలర్ మ‌రీ పేల‌వంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.  దాంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ త‌ప్ప‌ట్లేదు. ట్రైల‌ర్ క‌ట్ విష‌యంలో ఏమాత్రం శ్ర‌ద్ధ పెట్ట‌క‌పోవ‌డం.. శిల్పా శెట్టిని పూర్‌గా ప్రెజెంట్ చేయ‌డంతో అంద‌రూ నెగెటివ్ కామెంట్లే చేస్తున్నారు. ఇమేజ్ లేని హీరోతో భారీ ఫైట్లు చేయించ‌డం వింతంగా ఉందంటున్నారు.  జూన్ 17న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

ఇక నాని  మిడిల్ క్లాస్ కుర్రాడిలా  చేసిన చిత్రం MCA. సినిమా ఫన్ తో కాస్తంత యాక్షన్ తో నడిచిపోయింది. ఈ సినిమా వీక్ అవుతోంది  అనే సమయానికి నాని తన నేచ్యురల్ పెర్ఫార్మెన్స్ తో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. చాలా చోట్ల సక్సెస్ అయ్యాడు కూడ.  ఫస్టాలో వచ్చే నాని, అతని మిడిల్ క్లాస్ జీవితం తాలూకు సీన్లు, వదినకి అతనికి మధ్య నడిచే చిన్నపాటి మనస్పర్ధను బయటపెట్టే సన్నివేశాలు బాగుంటాయి. ఇందులోనే వచ్చే నాని, సాయి పల్లవిల లవ్ ట్రాక్ కూడా కొంత సరదాగా సాగుతూ ఆకట్టుకుంది. అయితే హిందీలో ఏ స్దాయిలో ఈ సినిమా నడుస్తుందో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios